నేడు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

NLR: కావలిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు, పూజ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ సోమవారం తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.