VIDEO: ఆకట్టుకుంటున్న ఉయ్యాల వినాయకుడు

ప్రకాశం: వినాయక చవితి సందర్భంగా ఒంగోలు నగరంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన వినాయక భారీ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నగర పరిధిలోని రంగు తోటలో ఉయ్యాల వినాయకుడు ప్రకృతి రమణీయతను ప్రతిబింబించేలా నెమళ్లు, పచ్చని చెట్లు భారీ సెట్టింగులతో వినాయక మండపం ఆకట్టుకుంటుంది. బుధవారం సాయంత్రం ఉయ్యాల వినాయకుడి సేవలో భక్తులు బారులు దీరుతున్నారు.