వైసీపీ ఆందోళన పోస్టర్ ఆవిష్కరణ
VSP: దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వైద్య కళాశాలలను నిర్మించారని, ఆయన కృషిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరికాదని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు విమర్శించారు. మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీ వద్ద, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28న చేపట్టనున్న ర్యాలీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.