నేడు ప్లాస్టిక్ నిర్మూలనపై ర్యాలీ

KDP: పులివెందులలో నేడు ఉదయం ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు శుక్రవారం తెలిపారు. ఈ ర్యాలీ మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాలీ పూలంగళ్ల సర్కిల్, పాత బస్టాండ్, వైఎస్ఆర్ సర్కిల్ వరకు ఉంటుందన్నారు. ఈ ర్యాలీలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.