'పైడిమెట్ట మెయిన్ రోడ్డు బాగు చేయండి'

E.G: తాళ్లపూడి(M) పైడిమెట్ట గ్రామం నుంచి గోపాలపురం వెళ్లే మెయిన్ రోడ్డు పెద్దపెద్ద గోతులతో నిండిపోయి ప్రయాణానికి సాధ్యం కానీ విధంగా ఉంది. కొద్దిపాటి వర్షానికి గోతుల్లో నీరు నిండిపోయి వాహనాలు అందులో కూరుకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు ఈ గుంతలను పూడ్చి అపాయల నుంచి కాపాడాలని వాహనదారులు కోరారు.