VIDEO: సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
KMR: బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు పండించిన సోయా పంటకు క్వింటాకు రూ.5,328 చొప్పున ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందన్నారు.