తెనాలిలో ఈ నెల 15న శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు

తెనాలిలో ఈ నెల 15న శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు

GNTR: శ్రీ శరణాగతి గోష్టి ఆధ్వర్యంలో ఈ నెల 15న తెనాలిలో శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. బుర్రిపాలెం రోడ్డులోని లక్ష్మీనగర్ ఆశ్రమంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి గురువారం తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు వేడుకలు జరుగుతాయని, భక్తులందరూ పాల్గొని కృతార్థులు కావాలని ఆయన కోరారు.