గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ నిపుణులు
ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ నుంచి సాయం పొందుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ మేరకు పశ్చిమాసియాకు 200 మంది తమ సైనిక నిపుణులు వెళ్లారని తెలిపారు. త్వరలో అక్కడికి వెళ్లడానికి మరికొంతమంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే, తమ దేశంలో రోజువారీ 2,000 ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు.