సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కౌన్సిలర్

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కౌన్సిలర్

MNCL: చెన్నూరు 18 వార్డులోని పబ్బ వాడలో DMFT నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ ఏతం శివకృష్ణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారి అమ్మవారి రోజైన శుక్రవారం అభివృద్థి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 18 వార్డు సమస్యలను పరిష్కరిస్తూ.. మరింత అభివృద్ధి చేస్తానని కౌన్సిలర్ పేర్కొన్నారు.