CPGET ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల

TG: ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించిన TGCPGET-2025 ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ కీ వెబ్‌సైట్‌లో ఉంచారు. 32 సబ్జెక్టుల ప్రిలిమినరీ ఆన్సర్ కీ https://cpget.tgche.ac.inలో ఉంచినట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. అభ్యర్థులు కీని పరిశీలించి, అభ్యంతరాలు ఉంటే, ఆగస్టు 19 ఉ.11 గంటల నుంచి ఆగస్టు 21 ఉ.11 గంటల వరకు ఆన్‌లైన్ మోడ్‌లో సమర్పించవచ్చని పేర్కొన్నారు.