'రైతులకు నష్టపరిహారం ఇవ్వని RDO కార్యాలయం జప్తు'
MHBD: దంతాలపల్లి మండలానికి చెందిన ధర్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకన్నలకు SRSP కెనాల్ కారణంగా కలిగిన నష్టానికి తగిన పరిహారం ఇవ్వాలని 2024లో జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. తొర్రూరు RDO ఆదేశాలను అమలు చేయకపోవడంతో కోర్టు జప్తు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు లాయర్‌తో కలిసి ఇవాళ RDO కార్యాలయంలోని బీరువాలు, కంప్యూటర్లు, కుర్చీలను జప్తు చేశారు.