పట్టణ సొసైటీ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు

పట్టణ సొసైటీ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు

ELR: జంగారెడ్డిగూడెం పట్టణ సొసైటీ(PASC) అధ్యక్షుడిగా మానికల నాగేశ్వరరావు నియమితులయ్యారు. అతనిని పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ అభినందించి పూలమాలతో సత్కరించారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని నాగేశ్వరావు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడిగా నియమించినందుకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు