సాక్షి కార్యాలయంలో సోదాలు చేసినందుకు నిరసన
NDL: నెల్లూరు జిల్లాలోని సాక్షి కార్యాలయంలో పోలీసులు అక్రమంగా ప్రవేశించి సోదాలు నిర్వహించిన విషయం విధితమే. ఈ ఘటనపై నిరసనగా బనగానపల్లె పట్టణంలోని స్థానిక విలేకరులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇవాళ నిరసన చేపట్టారు. ఈ మేకకు వారు మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను పోలీసులు హరించడం తగదన్నారు. విలేకరులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.