VIDEO: వాహనాల వేగ నియంత్రణకు భారీకేడ్లు
SRPT: జాతీయ రహదారి 65పై వాహనాల వేగ నియంత్రణ కోసం మునగాల మండలం ఆకుపాముల జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఐ రామకృష్ణా రెడ్డి సూచనల మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ ఈ చర్యలు చేపట్టారు. దీనిపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జంక్షన్ వద్ద సిగ్నల్ లైట్లు వెలగడం లేదని అధికారులు వెంటనే వాటిని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.