VIDEO: 'బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం'
MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రామాయంపేటలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. 50 శాతంలోపు రిజర్వేషన్ కారణంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రామాయంపేట మండలంలో కేవలం 2 పంచాయతీలు మాత్రమే బీసీలకు కేటాయించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.