ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై శిక్షణ
MNCL: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్)పై నస్పూర్‌లోని సింగరేణి అతిథి గృహంలో బుధవారం బీఎల్‌వోలకు శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ గడియారం శ్రీహరి ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, సవరణ గురించి వివరించారు. డిప్యూటీ తహసీల్దార్ హరిత పాల్గొన్నారు.