VIDEO: పెన్నా బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్

VIDEO: పెన్నా బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్

నెల్లూరు నగర శివార్లలోని పెన్నా వంతెన నుంచి వెంకటేశ్వరపురం బ్రిడ్జి వరకు గత కొన్ని గంటలుగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పెన్నా బ్రిడ్జి నుంచి నేషనల్ హైవే, బాంబే హైవే వైపు వెళ్లే రహదారులపై సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరుతున్నారు.