ఇళ్ల స్థలాల కోసం ఎగబడుతున్న ప్రజలు
AKP: ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలు మంజూరు కోసం దరఖాస్తులు అందజేయడానికి ముత్యాలమ్మపాలెం గ్రామస్తులు స్థానిక సచివాలయానికి తరలివచ్చారు. దీంతో సచివాలయం శుక్రవారం ఉదయం కిటకిటలాడుతుంది. ఈనెల 30 ఆఖరు తేదీ కావడంతో గ్రామస్తులు ఎగబడుతున్నారు. సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేకపోవడంతో పరవాడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంఛార్జ్ వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.