VIDEO: శ్రీరామనవమి వేడుకల్లో స్వామివారి పల్లకి సేవ
SRD: సిర్గాపూర్‌లో శ్రీరామనవమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రామాలయం నుంచి పురవీధుల గుండా హనుమాన్ మందిరం మీదుగా శ్రీరాములవారి పల్లకి సేవ చేపట్టారు. అనంతరం రామమందిరం చేరుకున్నారు. అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా కళ్యాణ్ రావు పటేల్ ఆధ్వర్యంలో శ్రీరాముడికి తొట్టెల కార్యక్రమాన్ని ఘనంగా చేసి పాటలు పాడారు.