VIDEO: మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రేపటి నుంచి ప్రారంభం
MLG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ. 251 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఈ జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది.