ACB వలలో వెహికిల్ ఇన్స్‌పెక్టర్.. అరెస్ట్
TG: అవినీతి నిర్మూలన కోసం ACB ఎక్కడికక్కడ సోదాలు, అరెస్టులు చేస్తున్నా కొందరి తీరులో మారట్లేలేదు. తాజాగా ఓ ఇటుక బట్టి వ్యాపారి నుంచి రూ.24 వేల లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా వైరా మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ వరప్రసాద్ పట్టుబడ్డాడు. ఆపై అతని ఆఫీసులో సోదాలు చేయగా ఆధారాలు లేని రూ.52,800 నగదు లభ్యమైందని, నిందితుడిని అరెస్ట్ చేశామని ACB అధికారులు తెలిపారు.