నామినేషన్ ఒత్తిడితో వార్డు అభ్యర్థి మృతి
RR: జిల్లా, ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ విషాదం చోటుచేసుకుంది. నాలుగో వార్డు అభ్యర్థి ఆవశేఖర్ రైలు పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందాడు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హత్య, ఆత్మహత్య కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.