సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PLD: అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం చిలకలూరిపేటలో అందజేశారు. 45 మంది లబ్ధిదారులకు రూ. 24.76 లక్షల విలువైన చెక్కులను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటుందని తెలిపారు.