భారీ వర్షానికి నీట మునిగిన బైక్‌లు, కార్లు

భారీ వర్షానికి నీట మునిగిన బైక్‌లు, కార్లు

RR: మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్ షిప్, శ్రీరాంనగర్, మణికొండ గ్రామం తదితర కాలనీలలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో అపార్ట్‌మెంట్లలో ఉన్న బైక్‌లు, కార్లు నీట మునిగిపోయాయి.