ఎడ్ల పందేలను ప్రారంభించిన MLA
ప్రకాశం: కొనకనమిట్ల మండలం గార్లదిన్నె పంచాయతీ పరిధిలోని వెలుగొండలో శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా ఇవాళ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎడ్ల పందాల పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్క గ్రామ ప్రజలు భారీగా వచ్చారు.