VIDEO: ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు
VSP: తుఫాను నేపథ్యంలో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం విశాఖపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ సిస్టం అస్తవ్యస్తంగా ఉండడంతో నీరు వెళ్లే దారి లేక ఇళ్లల్లోకి భారీగా చేరింది. స్థానిక అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.