VIDEO: 'మహాసభలను విజయవంతం చేయాలి'
SRCL: డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో మెదక్‌లో జరిగే CITU ఐదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. సిరిసిల్లలో మహాసభల పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మహాసభలలో అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చిస్తామన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు ప్రజలు హాజరై ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.