క్షుద్ర పూజల కలకలం
KDP: ఖాజీపేట (M) పాటిమీదపల్లెలో రామాలయం దగ్గర ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామంలో ఎవరో ఒకరిపై చేతబడి చేయించారేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.