'సీఎంపై బండి సంజయ్ విమర్శలు చేయడం సిగ్గుచేటు'
NLG: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది నుంచి కేంద్ర మంత్రిగా ఉండి ఇక్కడి రాష్ట్రాలకు నష్టం జరగనివ్వను అని చెప్పాల్సింది పోయి, సీఎంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.