వరంగల్ కలెక్టరేట్లో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్

WGL: జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడితే అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ డా. సత్య శారదా దేవి సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య ఏర్పడితే 1800 4253424 నంబర్‌కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.