గోదావరి జలాల పెంపు
SRPT: వారబంది విధానంలో విడుదల చేసిన గోదావరి జలాల పరిమాణాన్ని శనివారం పెంచినట్లు అధికారులు తెలిపారు. గతంలో 1,333 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ప్రస్తుతం దానిని 1,700 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణ గౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా, పొలాలకు పొదుపుగా వాడుకోవాలని కోరారు.