వాడపల్లి వెంకన్నకు 14.5 కిలోల ఇత్తడి దీపం కుందేలు సమర్పణ

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అమలాపురానికి చెందిన కరాటం సూరిబాబు, భామమణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం 14.5 కేజీల ఇత్తడి దీపం కుందెలను విరాళంగా సమర్పించారు. వీటిని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.