విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి: ఎంఈవో
SRD: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని ఎంఈవో శంకర్ అన్నారు. సదాశివపేట మండలం మద్దికుంట ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.