మా ఊరి కోటీశ్వరులే చంపించి ఉంటారు: ఓబయ్య

మా ఊరి కోటీశ్వరులే చంపించి ఉంటారు: ఓబయ్య

NLR: నెల్లూరు అయ్యప్ప గుడిసమీపంలో గతరాత్రి ఉదయగిరి(మం) సర్వరాబాద్ గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్యను హత్యచేసిన విషయం తెలిసిందే. ఘటనపై మృతుడి తండ్రి చిన్నబాల ఓబయ్య కీలకవ్యాఖ్యలు చేశారు. ‘మాఊరి పెద్దలతో మాకుగొడవలు ఉన్నాయి. నా కుమారుడు వాళ్ల అక్రమాలను అడ్డుకున్నాడు. వాళ్లు కోటీశ్వరులు, డబ్బులు ఇచ్చి నా కుమారుడిని చంపించి ఉంటారు’ అని అనుమానం వ్యక్తం చేశాడు.