బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపించాలి: మంత్రి

బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపించాలి: మంత్రి

NRPT: మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు, నిర్వాహకులకు సూచించారు. బుధవారం ఆలయ కోనేరు పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ నెలాఖరులోపు పనులు పూర్తి చేసి డిసెంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు కోనేరును సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.