సింహాచలంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు
VSP: సింహాచలం వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో గురువారం తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా జరుగతున్నాయి. గోవింద రాజ పెరుమాళ్లని, ఆళ్వార్లను ఆస్థాన మండపంలో అదిష్ఠించి పూజలు చేశారు. అనంతరం ఆలయ స్థానాచార్య నాయిలార్ దివ్య ప్రబంధాన్ని గానం చేశారు. ఆదివారం మొదలుకొని ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాలు గురువారంతో ముగుస్తున్నాయి.