ఛైర్‌పర్సన్‌కు రాష్ట్ర కార్యవర్గంలో చోటు
NRPT: నారాయణపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్‌ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. పలువురు నేతలు ఛైర్ పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.