మండల రైతులకు ముఖ్య గమనిక

మండల రైతులకు ముఖ్య గమనిక

NRPT: నేటి నుంచి రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్వహిస్తున్నట్లు కోయిలకొండ మండల వ్యవసాయ అధికారి యామ రెడ్డి మంగళవారం తెలిపారు. ఆధార్ కార్డు మాదిరిగా రైతులకు 11 నంబర్లతో యూనిట్ కోడ్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ ఫార్మర్ ఐడీని పొందేందుకు, ఆధార్, భూమి పాస్ పుస్తకం ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌తో ఏఈవోలను సంప్రదించాలన్నారు.