క్రీడా మైదానంలో స్వాతంత్య్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు

సత్యసాయి: హిందూపురం ఎంజీఎం క్రీడా మైదానంలో ఆగస్టు 15న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ డి.ఈ. రమేష్ తెలిపారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. దేశభక్తి, సమైక్యత పెంపొందేలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు కలసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.