ఆ ఊళ్లోకి ఐస్ క్రీం బండ్లకు నో ఎంట్రీ.!
TPT: పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం పెద్దలు వినూత్న ఆలోచన చేశారు. గూడూరు గ్రామంలోని చిన్నారులు నాణ్యత లేని ఐస్ క్రీంలు తినడం వల్ల వారిలో దంత, జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు ఐస్ క్రీం బండ్లను గ్రామంలోకి అనుమతించబోమని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి ఊర్లోకి వస్తే రూ. 5000 జరిమానా విధిస్తామని బ్యానర్లు ఏర్పాటు చేయడంతో SMలో వైరల్‌గా మారింది.