VIDEO: అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
HNK: పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా సేవల్లో మరింత పారదర్శకత వస్తుందని తెలిపారు. పరకాల ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం 165 మంది టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.