'నూతన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి'

'నూతన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి'

MNCL: బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గెలిచిన సర్పంచ్‌లను క్యాంప్ కార్యాలయంలో MLA గడ్డం వినోద్ గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గెలిచిన సర్పంచ్‌లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.