ఆర్టీసీ గ్యారేజీలో జారిపడిన కండక్టర్

ప్రకాశం: గిద్దలూరు ఆర్టీసీ గ్యారేజీలో మంగళవారం కండక్టర్ వీరమ్మ జారిపడి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె కుడి కాలు విరగడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. గతంలోనూ ఇదే గ్యారేజీలో వర్షం కారణంగా ఏర్పడిన బురద వల్ల ఉద్యోగులు జారి గాయపడ్డారని, ఉన్నతాధికారులు మరమ్మతులు చేయలేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.