వివాహం జరగడం లేదని యువకుడు ఆత్మహత్య
WGL: రాయపర్తి మండలం దుబ్బ తండాకు చెందిన బట్టు మురళి (22) అనే యువకుడు పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మురళి, వివాహ సంబంధం కుదరకపోవడంతో మనస్థాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.