వెబ్ కాస్టింగ్ ద్వారా నిశితంగా పర్యవేక్షించాం: కలెక్టర్

వెబ్ కాస్టింగ్ ద్వారా నిశితంగా పర్యవేక్షించాం: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలను వెబ్ కాస్టింగ్ ద్వారా నిశితంగా పర్యవేక్షించినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గురువారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్‌లో SP నితికా పంత్, పరిశీలకుడు శ్రీనివాస్‌తో కలిసి పోలింగ్, కౌంటింగ్ పరిస్థితిని సమీక్షించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వారు పేర్కొన్నారు.