'వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలి'

'వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలి'

RR: వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందించి, జీవో 34ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.