విద్యార్థులతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం
PLD: చిలకలూరిపేట శ్రీ శారద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు విద్యార్థులు కూడా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పవన్ పక్కనే కూర్చున్న విద్యార్థులతో విద్యపై చర్చించారు. ఆయన రాకతో చిన్నారులు పాటలతో ఆకట్టుకున్నారు.