నేటి నుంచి చేనేత కార్మికులకు వైద్య శిబిరాలు

నేటి నుంచి చేనేత కార్మికులకు వైద్య శిబిరాలు

BHNG: నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ నుంచి మే 13 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 10,323 మంది చేనేత కార్మికులకు ఆయా మండలాలు, గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి రోజూ ఉదయం 9గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తాయన్నారు.