శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్రహోమం ప్రారంభం

శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్రహోమం ప్రారంభం

TPT: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 8 నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.