వేంపల్లిలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరికలు
TPT: వేంపల్లి మండలానికి చెందిన పలువురు యువకులు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ మేరకు కడప జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, కో- కన్వీనర్ దాదా పీర్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆప్ పార్టీ కృషి చేస్తోందని, ప్రజాసేవే పార్టీ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆఫ్ మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.